ఈ బాల మేధావికి ప్రపంచ రికార్డు!

laurent-simons
laurent-simons

నెదర్లాండ్స్‌: తొమ్మిదేండ్లకే ఇంజినీరింగ్‌ చదివిన ఘనత సాధించబోతున్నాడో చిన్నోడు. నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కు చెందిన లారెంట్‌ సైమన్స్‌ అనే బాలుడు ఐండ్హోవెన్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికిల్‌ ఇంజినీరింగ్‌లో బాచిలర్స్‌ డిగ్రీ చేస్తున్నట్టు డైలీ మెయిల్‌ పత్రిక పేర్కొంది. మరో నెల రోజుల్లో డిగ్రీ అయిపోతుందని, ఆ తర్వాత పీహెచ్‌డీ కూడా చేస్తానని ఈ బాల మేధావి చెప్తున్నాడు. లారెంట్‌ ఐక్యూ (ప్రజ్ఞాసూచి) 145. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇతనికి 11,000 మంది ఫాలోవర్స్‌ ఉండటం మరో విశేషం. కాగా గతంలో పదేండ్ల వయసులో మైఖేల్‌ కెర్నీ అనే బాలుడు అమెరికాలోని అలబామా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొంది ఉండటం విశేషం. అతి చిన్నవయసులోనే డిగ్రీ సాధించిన బాలుడిగా మైఖేల్‌ కెర్నీ సృష్టించిన రికార్డును లారెంట్‌ అధిమించబోతున్నాడు.
తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/