ఒక మహిళ కోసం 9 హత్యలు

72 గంట‌ల్లో నిందితుడు సంజ‌య్ అరెస్ట్

9 Murders case

Warangal: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన వరంగల్‌ జిల్లా గొర్రెకుంట ఘటనను సవాలుగా తీసుకున్న పోలీసులు రాత్రింబవళ్లు ముమ్మరంగా దర్యాప్తు చేసి హంతకుడిని పట్టుకున్నారు..

బీహార్‌కు చెందిన సంజయ్‌కుమారే తొమ్మిది మందికి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు ఇచ్చి బావిలో పడేసినట్టు తేల్చారు.

ఈ కేసు వివ‌రాల‌ను వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌న‌ర్ వివ‌రించారు.. ఈ తొమ్మిది హ‌త్య‌ల‌కు ఒక మ‌హిళ హ‌త్య సంఘ‌ట‌న కార‌ణ‌మైంది..

బావిలో తొమ్మిది మంది శవాల రహస్యాన్ని కేవలం 72 9 Murders caseగంటల్లో తేల్చారు పోలీసులు. 6 బృందాలు, 100 మంది సిబ్బంది కలిసి మృత్యుబావి మిస్టరీని ఛేదించారు. . ఇంటి పెద్ద మక్సూద్ కు చెందిన బంధువు ర‌ఫీకాతో నిందితుడు గ‌త మూడేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తున్నాడు..రఫీకాకు యుక్త‌వ‌య‌స్సు కుమార్తెపై సంజ‌య్ క‌న్ను ప‌డింది..

ఈ విష‌యంపై ర‌ఫీకా నిందితుడు సంజ‌య్ ను నిల‌దీసింది. అదేం లేదంటూ, నిన్నే పెళ్లి చేసుకుంటాన‌ని న‌మ్మ‌బ‌లికి ఆమెను కోల్ క‌త్తాకు రైలు మార్చి 6వ తేదిన తీసుకుని బ‌య‌లుదేరి రాజ‌మండ్రి స‌మీపంలో ఆమెకు మ‌జ్జిక‌లో మ‌త్తు బిల్ల‌లు క‌ల‌పి ఆమెకు ఇచ్చాడు..

ర‌ఫీకా స్పృహ త‌ప్పిన త‌ర్వాత చున్నీతో హ‌త్య చేశాడు..అనంత‌రం ఆమెను రైలు నుంచి కింద‌కు తోసేసి తిరిగి మ‌రో రైలులో రాజ‌మండ్రి నుంచి వ‌రంగ‌ల్ కు చేరుకున్నాడు.

కొన్ని రోజుల‌గా ర‌ఫీకా క‌నిపించ‌క‌పోవ‌డంతో సంజ‌య్ ను మ‌క్సూద్ దంప‌తులు నిల‌దీశారు.. పోలీసుల‌కు ఫిర్యాదు చేస్తామ‌ని హెచ్చ‌రించారు..

దీంతో త్వ‌ర‌లోనే ఆమె ఊరు నుంచి వ‌స్తుంద‌ని నమ్మ‌బ‌లికాడు.. తాను హ‌త్య చేసిన విష‌యం తెలిసిపోతుంద‌ని భావించిన సంజ‌య్ వారి హ‌త్య‌కు స్కెచ్ వేశాడు.

.ఈ నెల 20వ తేదిన మ‌క్సూద్ కుమారుడు పుట్టిన రోజు నాడు వాళ్ల ఇంటికి వెళ్లి వారు తినే ఆహార ప‌దార్దాల‌లో క‌లిపాడు..

అదే స‌మ‌యంలో వారి ఇంటిపై ఉంటున్న మ‌రో ఇద్ద‌రు బీహారీలు ఉండ‌టం గ‌మ‌నించి వారు తినే ఆహారంలో మ‌త్తు క‌లిపాడు..

అంద‌రూ మ‌త్తులో ప‌డ‌డిపోయిన త‌ర్వాత సంజ‌య్ ఒక్కొక్క‌రిని గోనె సంచ‌లో కుక్కి ప‌క్క‌నే ఉన్న ఊట బావిలో ప‌డ‌శాడు..

సంజ‌య్ హ‌త్య చేసిన వారిలో మక్సూద్ ఆలం (50), ఆయన భార్య నిషా ఆలం (45), కూతరు బూస్రా ఆలం (22), ఈమె మూడు సంవత్సరాల బాలుడు, మక్సూద్ ఆలం పెద్ద కుమారుడు షాబాజ్ ఆలం (21), చిన్న కుమారుడు సోహైల్ ఆలం (20) వీరితో పాటు గోనె సంచుల గోదాం దగ్గరికి వాహనాలను నడిపే త్రిపురకు చెందిన డ్రైవర్ షకీల్ (40)తో పాటు బీహార్‌కు చెందిన శ్రీరామ్ (35), శ్యామ్ (40)లు ఉన్నారు.

సంజ‌య్ క‌ద‌లిక‌లు సిసి టి వి కెమెరాలో న‌మోదు కావ‌డంతో అత‌డిని పోలీసులు అదుపులోకి తీసుకుని త‌మ‌దైన శైలీలో ప్ర‌శ్నించ‌డంతో ఈ హ‌త్య‌లు తానే చేసిన‌ట్లు ఒప్పుకున్నాడు.

రఫీకా హ‌త్య బ‌య‌ట‌ప‌డుతుంద‌నే భ‌యంతోనే ఈ హ‌త్య‌లు చేసిన‌ట్లు సంజ‌య్ పోలీసుల‌కు వివ‌రించాడు.

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/