9వేల ‘శత్రు’ ఆస్తుల విలువ లక్షకోట్లు

Cash

9వేల ‘శత్రు’ ఆస్తుల విలువ లక్షకోట్లు

మనదేశం నుంచి ఇతర దేశాలకు వలసపోయిన వారి ఆస్తులనుగుర్తించి ప్రస్తుత మార్కెట్‌ రేటుప్రకారం వాటివిలువను నిర్ణయించి వేలంద్వారా విక్రయించడా నికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హోం మంత్రిత్వశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దేశం మొత్తం మీద ఇటు వంటి ఆస్తులు 9400 వరకు ఉన్నట్టు అంచనా. ఇక్కడ కొన్నేళ్లు నివాసం ఉండి ఆ తరువాత చైనా లేదా పాకిస్థాన్‌ దేశాల పౌర సత్వం తీసుకున్న ఆస్తులు ఇవి. వీటిని శత్రు ఆస్తులు (ఎనివిూ ప్రాపర్టీస్‌) అని అంటారు. దీనికి సంబంధించిన ఎనివిూ ప్రాపర్టీ చట్టాన్ని ఇప్పుడు సవరించారు. దీని ప్రకారం దేశ విభజన సమ యంలో కానీ లేదా తరువాతయినా ఎవరైతే భారత దేశం విడిచి పెట్టి ఆయా దేశాలకు వెళ్లి అక్కడి పౌరసత్వం పొందారో వారి తాలూకు ఇక్కడి ఆస్తులపై వారికి ఎలాంటి చట్టపరమయిన హక్కు ఉండదు.

ఈ ఆస్తులపై ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికి 6289 ఎనివిూ ప్రాపర్టీస్‌పై సర్వే పూర్తయింది. ఇంకా మిగతా 2991 ఆస్తులపై సర్వే జరుగుతున్నట్టు ఉన్నతాధికార వర్గాలు కేంద్రహోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు వెల్లడించాయి. ఇప్పటికి సర్వే పూర్తయిన ఆస్తులను వీలయినంత త్వరగా వేలం వేయాల్సిందిగా హోంమంత్రి ఆదేశించారు. ఇటువంటి ఆస్తుల విలువ ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం లక్ష కోట్ల రూపాయలకు మించి ఉంటుందని తేలింది. అందువల్ల ప్రభుత్వ ఆర్థిక వనరుల అవస రాల దృష్ట్యా ఈ ఆస్తుల అమ్మకం తక్షణం నిర్వహించాలని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టంచేశారు.ఇదేవిధంగా దేశవిభజన సమ యంలో పాకిస్థాన్‌ నుంచి భారత దేశానికి వచ్చి స్థిరపడిన వారి ఆస్తులను పాకిస్థాన్‌ ప్రభుత్వం ఏనాడో వేలం వేసింది. రాష్ట్రాల్లో ఎక్కడయితే ఎనివిూ ప్రాపర్టీస్‌ ఉన్నాయో వాటిని గుర్తించడానికి వీలుగానోడల్‌ ఆఫీసర్లను నియమించాలని హోం మంత్రిత్వశాఖ రాష్ట్రాలను ఆదేశించింది.ఆయా ఆస్తులను గుర్తించ డంతోపాటు ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయో కూడా సమగ్రంగా వివరాలు సేకరించి నోడల్‌ ఆఫీసర్లు ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది.

ప్రస్తుత మార్కెట్‌ రేటు ప్రకారం వాటి విలువ ఎంతో పరిగణించవలసి ఉంటుంది. దేశం మొత్తం మీద ఉన్న 9280 ఎనివిూ ప్రాపర్టీస్‌ అత్యధికంగా 4991 ఆస్తులు ఉత్తరప్రదేశ్‌లో ఉండగా, రెండవస్థానం పశ్చిమబెంగాల్‌లో 2735 ఆస్తుల వరకు ఉన్నాయి. న్యూఢిల్లీలో 487 ఆస్తులు ఉన్నాయి. ఈ ఆస్తుల్లో ఎక్కువ శాతం ముఖ్యమయిన ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం వాణిజ్య కూడలి ప్రాంతాలుగా వర్థిల్లుతున్నాయని మంత్రిత్వశాఖ అధికార వర్గాలు వివరించాయి. భూదాన భూములు మాయం ఇదే విధంగా భూదాన భూముల వివరాలు కూడా సరిగ్గా రికార్డు ల్లో ఉండడం లేదు.ఆచార్య వినోభావే భూదాన ఉద్యమం ముమ్మ రంగా సాగించినప్పుడు 1951లో దాదాపు 23,034 ఎకరాలు ఈ జాబితాలో చేరాయి. ఇందులో భూస్వాములు 14,720 ఎకరాలను దానం చేశారు.

రానురాను అక్రమార్కుల ఆక్రమణల వల్ల 4800 ఎకరాలు రికార్డులలో కనబడకుండాపోయాయి. 13,101 ఎకరాలకు ఎలాంటి సర్వే నెంబర్లులేవ్ఞ. 19,929 ఎక రాలకు మాత్రమే సర్వే నెంబర్లు ఉన్నాయి. 1951లో తెలంగాణ లోని పోచంపల్లి గ్రామానికి వచ్చారు. ఒకప్పుడు ఈ గ్రామం నల్లగొండ జిల్లాలో ఉండేది. ఆ తరువాత ఇప్పుడు యాదగిరి భువనగిరి జిల్లాలో చేరింది. భూదాన యజ్ఞబోర్డు తనిఖీలో 11,470ఎకరాలు మాత్రమే ఇబ్రహింపట్నం, కందుకూరు, హయ త్‌నగర్‌ ప్రాంతాల్లో బయటపడ్డాయి.

-కె.అమర్‌