8వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

8th Pashuram: Thiruppavai
8th Pashuram: Thiruppavai


కీళ్‌వానమ్‌ వెళ్లెను ఎరుమై శిరువీడు
మేయ్వాన్‌ పరన్దనకాణ్‌ మిక్కుళ్ల పిళ్లూకళుమ్‌
పోవాన్‌ పోకినా ప్పోగామల్‌ కాత్తు, ఉన్నై
క్కూవ్ఞవాన్‌ వందు నినోమ్‌, కోదుకలముడైయ
పావాయ్! ఎళున్దిరాయ్ పాడిప్పఱై కొండు
మావా య్ పిళన్దానై మల్లరై మాట్టియ
దేవాదిదవేనై చ్చెను€ నాం శేవిత్తాల్‌
ఆవావెనా రాయ్న్దు అరుశేలో రెమ్బావాయ్II
ఎనిమిదవ పాట
వెండి వెలుగుల తూర్పు వెడలుచుండ
నాల్గుదిక్కుల పశులుగ్రాసాలు మేయుచుండ
గోవర్థనుని గొల్వ గోపికలు వెడల
నిను పిల్వ వచ్చితివి, కృష్ణప్రియురాలా!
కేశినే చంపిన కేశవుని కొల్చి
మల్లులను చంపిన మాధవుని కొల్చి
దేవాది దేవతల దేవ్ఞడై వెలుగు
కృష్ణావతారుని కీర్తించుదాము
దయచూపు మనపైన దామోదరుడు
కరమెత్తి దీవించి కనికరించు.
భావం: ఆకాశము తూర్పు దిక్కున తెల్లబడుచున్నది. గోపాలురు మేత మేయుట కొరకు గేదెలను వదిలినారు. పిల్లలు పనులు చేయడానికి పోతు న్నారు. వారిని నీ ఇంటి ముందు నిన్ను పిలుచుటకు ఆపినాము. కేశియను రాక్షసుని నోటిని చీల్చిన, చాణూర మల్లుల జంటను చంపిన, సర్వదేవతలకు దేవ్ఞడైన వానిని, కృష్ణాకృష్ణా అని పాటలు పాడి వ్రతమునకు కావలసిన ‘పరయను సాధనమును
పొంది, మనమంతా కలిసి సేవించుదాం. అప్పుడు కృష్ణుడు అయ్యో, మీరే వచ్చి తిరని మనపై జాలిపడి మన మంచి చెడ్డలు ఆలోచించి మనపై కృప చూపు తాడు. అనుచు వెలుపలి
గోపికలు లోపల నిదురించుచున్న మరొక గోపికను మేల్కొలుపుతున్నారు.
ఫలం: పరిజ్ఞానం కలుగుతుంది.

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/