ఎనిమిదోరోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్: ఎనిమిదో రోజు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు జీహెచ్ఎంసీ సహా నగరపాలికలు, శివారు మున్సిపాలిటిల్లో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. ఇక శాసనసమండలిలో విద్యుత్ అంశాలపై చర్చ జరగనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మండలిలోనూ తీర్మానం చేయనున్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/