యూకేలో కొత్తగా 871 పాజిటివ్‌ కేసులు

మొత్తం కేసులు 3,09,005

corona virus-uk

లండన్‌: యూకేలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటల్లో ఆ దేశంలో కొత్తగా 871 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 98 మంది మృత్యువాత పడ్డారు. ఇప్పటివరకు ఆ దేశంలో మొత్తం 3,09,005 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా 46,511 మంది మృతి చెందారని ఆరోగ్య, సామాజిక రక్షణ శాఖ శుక్రవారం తెలిపింది. లక్షా 40 వేల జనాభా ఉన్న ప్రెస్టన్‌ నగరంలో జులై వరకు 49 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని, ఇది గతవారం నమోదైన కేసులకు రెట్టింపని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. నగరంలో కేసులు పెరుగుతుండడంతో ఇంటిలోపల, తోటల్లో ఎవ్వరూ కలవకుండా నేటి అర్ధరాత్రి నుంచి ఆంక్షలు తిరిగి అమలులోకి రానున్నాయని పేర్కొన్నారు. గ్రేటర్ మాంచెస్టర్, లీసెస్టర్ వెస్ట్ఈస్ట్ యార్క్‌షైర్‌లోని 18 ప్రాంతాలతోపాటు స్కాటిష్ పట్టణం అబెర్డీన్‌లోనూ ఇదే తరహా ఆకాంక్షలు అమలులోకి రానున్నట్లు స్పష్టం వెల్లడించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/