86వ ప్రజాసంకల్పయాత్ర కార్యాచరణ

Jagan
Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత వైఎస్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 86వ రోజు కార్యాచరణ ఖరారైంది. ఈ రోజు ఉదయం 8గంటలకు ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం వద్ద పెద్ద కొండూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు. అక్కడి నుంచి పెద్దపాడు మీదుగా వీరారెడ్డి పాలెం చేరుకొని పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం పోలంపాడు మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. తదనంతరం మధ్యాహ్నాం 12గంటలకు భోజన విరామం తీసకుంటారు. మధ్యాహ్నాం 3గంటలకు పాదయాత్ర పున:ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కలిగిరి చేరుకుంటారు. సాయంత్రం 5.30గంటలకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగించుకుని అక్కడ బస చేస్తారు.