ఏపిలో మరో 85 కొత్త పాజిటివ్‌ కేసులు

ప్రస్తుతం చికిత్స పొందుతున్నావారు..777

Corona-cases-in-Andhra-Pradesh
Corona-cases-in-Andhra-Pradesh

అమరావతి: ఏపి కరోనా వ్యాప్తి కొనసాగుతుంది. గత 24 గంటల్లో 85 మంది కరోనా పాజిటివ్‌గా తేలారు. 79 మంది కరోనా నుంచి కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. కరోనా బారిన పడి కర్నూల్ జిల్లాలో ఒకరు చనిపోయారు. రాష్ట్రంలో నమోదైన మొత్తం 2784 కేసులలో 2037మంది డిశ్చార్జ్ కాగా, 60 మంది మరణించారు. ప్రస్తుతం 777 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కొత్తగా నమోదైన పాజిటివ్ కేసులలో చిత్తూర్‌లో నలుగురు, నెల్లూరులో ఇద్దరు.. తమిళనాడులోని కోయంబేడు నుంచి వచ్చారని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది.


తాజా తెలంగాణ వార్తల కసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/