దేశంలో కొత్తగా 8,488 కరోనా కేసులు

దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1,18,443

న్యూఢిల్లీ : దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. మరోసారి 9వేల దిగువకు కేసుల సంఖ్య వచ్చింది. గత 24 గంటల్లో 7,83,567 మందికి కోవిడ్ టెస్టులు నిర్వహించగా… 8,488 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో 249 మంది మృతి చెందారు. కేరళలో గత 24 గంటల్లో 5,080 కేసులు నమోదు కాగా 40 మరణాలు సంభవించాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 12,510 మంది కరోనా నుంచి కోలుకోగా… కేరళలో 7,908 మంది కోలుకున్నారు.

ప్రస్తుతం దేశంలో 1,18,443 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 534 రోజుల్లో ఇంత తక్కువ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. గత ఏడాది ప్రారంభం నుంచి మొత్తం 3.45 కోట్ల మంది కరోనా బారిన పడగా… 3.39 కోట్ల మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 4,65,911 మంది మృతి చెందారు. నిన్న 32,99,337 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. ఇప్పటి వరకు 116 కోట్లకు పైగా డోసులను పంపిణీ చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ :

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/