ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం..84 శాతం ఒమిక్రాన్ కేసులే!

నిన్న ఢిల్లీలో 3,194 కరోనా కేసుల నమోదు


న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఒమిక్రాన్ కేసులు కలకలం రేపుతున్నాయి. కోవిడ్ కేసుల్లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఢిల్లీ ఆరోగ్య మంత్రి తెలిపారు. డిసెంబర్ 30-31 తేదీల్లో జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపిన శాంపిల్స్ లో 84 శాతం ఒమిక్రాన్ కేసులు నిర్ధారణ అయ్యాయని ఆయన చెప్పారు. మరోవైపు ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ ప్రమాదకర స్థాయిలో పెరుగుతున్నాయి. పాజిటివిటీ రేటు 6.5 శాతం పెరిగింది. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ 23 రాష్ట్రాలకు వ్యాపించింది. వీటిలో మహారాష్ట్ర, ఢిల్లీలో ఎక్కువ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీలో నిన్న 3,194 కరోనా కేసులు నమోదయ్యాయి. శనివారం కంటే ఈ సంఖ్య 15 శాతం ఎక్కువ కావడం గమనార్హం.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/