బైసాఖి ఉత్సవాలకు పాక్‌కు సిక్కుల బృందం

sikh devotees
sikh devotees


పంజాబ్‌: ఏప్రిల్‌ 12 నుంచి 21 వరకు బైసాఖి ఉత్సవాల్లో పాల్గొనేందుకు భారత్‌ నుండి సిక్కుల బృందం పాకిస్తాన్‌కు బయలుదేరింది. అమృత్‌సర్‌ నుంచి 839 మంది సిక్కు భక్తులు పాకిస్తాన్‌లోని ప్రసిద్ధ గురుద్వారా పంజా సాహిబ్‌ ఆలయానికి బయలుదేరారు. పాక్‌లో హసన్‌ అబ్దుల్‌ ప్రాంతంలో గురుద్వారా పంజా సాహిబ్‌ ఆలయం ఉంది. పంటలు చేతికొచ్చే సందర్బంలో సిక్కులు బైసాఖి పండుగను జరుపుకుంటారు. బైసాఖి ఉత్సవాలను సిక్కులు నూతన సంవత్సరంగా కూడా పరిగణిస్తారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు పాక్‌ 2200 మందికి సిక్కులకు వీసాలు జారీచేసింది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/