దేశంలో కొత్తగా 8,318 కరోనా కేసులు నమోదు

న్యూఢిల్లీ : దేశంలో రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారం 10 వేలకుపైగా నమోదవగా, తాజాగా అవి ఎనిమిది వేలకు తగ్గాయి. నిన్నటికంటే అవి 21 శాతం తక్కువని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. యాక్టివ్‌ కేసులు లక్షకు తగ్గాయని పేర్కొన్నది.

దేశవ్యాప్తంగా కొత్తగా 8,318 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,63,749కి చేరాయి. ఇందులో 1,07,019 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 3,39,88,797 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,67,933 మంది వైరస్‌కు బలయ్యారు. గత 24 గంటల్లో కొత్తగా 10,967 మంది మహమ్మారి నుంచి బయటపడగా, 465 మంది మృతిచెందారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/