దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు

న్యూఢిల్లీ : దేశంలో కోవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. తాజాగా దేశంలో కొత్తగా 8306 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ తో 211 మంది మరణించగా, 8834 మంది కరోనా నుంచి కోలుకున్నారు . దేశంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 3,46,41,561కు చేరింది. ఇందులో 3,40,69,608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మహమ్మారి వల్ల 4,73,537 మంది మృతిచెందారు. మరో 98,416 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/