ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదుల హతం

షోపియాన్, పాంపొరా ప్రాంతాల్లో ఘటన

ఎన్‌కౌంటర్‌లో 8 మంది ఉగ్రవాదుల హతం
Jammu and Kashmir encounter

శ్రీనగర్‌: జ‌మ్మూక‌శ్మీర్‌లో ఉగ్ర‌వాదుల ఏరివేత కొన‌సాగుతోంది. గ‌త 24 గంట‌ల్లో ఎనిమిది మంది ఉగ్ర‌వాదుల‌ను ముట్టుబెట్టారు. పాంపొరాలోని ఓ మసీదులో నక్కిన ఉగ్రవాదులను బయటకు రప్పించడానికి భద్రతా బలగాలు టియర్ గ్యాస్ షెల్స్‌ను విజయవంతంగా వినియోగించారు. మసీదుకు నష్టం కలగకుండా అన్ని చర్యలు తీసుకుని వారిని హతమార్చారు. షోపియాన్‌లో మొత్తం ఐదుగురిని, పాంపొరాలో ముగ్గుర్ని హతమార్చినట్లు అధికారులు ప్రకటించారు.

సాధార‌ణంగా ఉగ్ర‌వాదులు దాక్కున్న ప్రాంతాన్ని చేధించేందుకు.. భ‌ద్ర‌తా ద‌ళాలు ఎక్కువ‌గా ఐఈడీల‌ను వాడుతుంటారు లేదా ఫైరింగ్‌కు పాల్ప‌డుతుంటారు. కానీ పాంపోర్ ఆప‌రేష‌న్ అత్యంత అరుదైన‌ద‌ని పోలీసులు చెబుతున్నారు. కేవ‌లం టియ‌ర్ స్మోక్ షెల్స్‌తోనే ఆప‌రేష‌న్ నిర్వ‌హించి.. ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టిన‌ట్లు తెలిపారు.  ఉగ్ర‌వాదులు ఉన్న స‌మాచారం తెలుసుకున్న పోలీసులు.. నిన్న ఉద‌యం నుంచి ఆప‌రేష‌న్ మొద‌లుపెట్టారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/