తెలంగాణ‌లో మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్

తెలంగాణ‌లో మ‌రో 8 కొత్త మెడిక‌ల్ కాలేజీల ఏర్పాటుకు ప్ర‌భుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖమ్మం, కరీంనగర్, అసిఫాబాద్, సిరిసిల్ల, జనగాం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో కొత్తగా 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2023– 24 విద్యా సంవత్సరం నుంచి క్లాసులు ప్రారంభం కానున్ను ఈ కాలేజీల్లో మొత్తం 1200 వరకు ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కాగా… ప్రస్తుతం ఉన్న కరీంనగర్ లోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిని మెడికల్ కళాశాలగా అప్రూవల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయగా… ఆ ఉత్తర్వులను సీఎం కేసీఆర్ నుంచి మంత్రి గంగుల కమలాకర్ అందుకున్నారు.

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో 168 కోట్ల అంచనా వ్యయంతో 100 ఎంబీబీఎస్ సీట్ల సామర్ధ్యంతో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటు కానుంది. రూ.190కోట్ల అంచనా వ్యయంతో.. వంద ఎంబీబీఎస్‌ సీట్ల సామర్థ్యంతో ప్రభుత్వ కాలేజీ ఏర్పాటుతో పాటు అనుబంధంగా ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తూ ప్రభుత్వం శనివారం జీవో విడుదల చేసింది. గతంలో జనగామ పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు పరిపాలన అనుమతులను నేతలు అందుకోగా.. వెంటనే మెడికల్‌ కాలేజీకి సంబంధించిన పనులు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఇచ్చిన హామీ మేరకు జనగామకు వైద్య కళాశాలను మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌కు నేతలు ధన్యవాదాలు తెలిపారు.