8 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలింపు

fani effect
fani effect

భువనేశ్వర్‌: ఫణి తుఫాను తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒడిశా తీరప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గురువారం నుంచి దాదాపు 8 లక్షల మందిని షాలిమార్‌ ప్రాంతానికి ప్రత్యేక రైళ్లలో తరలించాలని అధికారులు నిర్ణయించారు. మే 3వతేదీన ఈ తుఫాను వల్ల గంటకు 200 కి.మీ.ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం చేసిన హెచ్చరికల దృష్ట్యా పూరి, చాంద్‌ బలి, గోపాల్‌ పూర్‌ ప్రాంతాలనుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించనున్నారు. తుఫాను తవ్రత గంజాం, గజపతి, పూరి, కేంద్రపద, భాద్రక్‌, జైపూర్‌, బాలాసోర్‌ జిల్లాల్లో అధికంగా ఉంటుందని వాతావరణ కేంద్ర అధికారులు చేసిన హెచ్చరికలతో ప్రజలను తరలిస్తున్నారు. ఫణి విపత్తుతో పశ్చిమబెంగాల్‌, ఒడిశా, ఏపిలోని మూడు జిల్లాలలో ఆరంజ్‌ అలర్ట్‌ జారీ చేశారు. తుఫాను బాధితుల కోసం 879 సహాయపునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/business/