యూనివ‌ర్సిటీలో కాల్పులు.. 8 మంది మృతి

మాస్కో: ర‌ష్యా పెర్మ్ న‌గ‌రంలో ఓ యూనివ‌ర్సిటీ క్యాంప‌స్‌లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అనేక మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. కాల్పులకు పాల్ప‌డిన దుండ‌గుడిని ప‌ట్టుకున్నారు. ఓ బిల్డింగ్ నుంచి అనేక మంది విద్యార్ధులు భ‌యంతో పారిపోతున్న దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైర‌ల్‌ అయ్యాయి. పెర్మ్ స్టేట్ యూనివ‌ర్సిటీలో కాల్పుల ఘ‌ట‌న జ‌రిగింది. ఇది అత్యంత ఓల్డ్‌ యూనివ‌ర్సిటీ. వీలైతే క్యాంప్‌ను వ‌దిలి వెళ్లండి లేదా రూమ్‌ల్లోనే తాళాలు వేసుకుని ఉండాల‌ని ఇవాళ ఉద‌యం యూనివ‌ర్సిటీ ఓ అల‌ర్ట్ ఇచ్చింది. పెర్మ్ న‌గ‌రంలో ఉన్న వైద్య అధికారులు సుమారు 10 మంది మృతిచెందిన‌ట్లు తెలుస్తోంది. ఇంకా ఎక్కువ సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌వించి ఉంటాయ‌ని పోలీసులు భావిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/