శ్రీశైలం ప్రాజెక్టు 8 గేట్లు ఎత్తివేత

srisailam-project

కర్నూల్‌: రెండురోజులుగా కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో అధికారులు 8 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా దిగువ నాగార్జున సాగర్‌కు 2 లక్షల 22 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.50 అడుగులు (212.91 టీఎంసీలు)గా ఉంది. కుడిగట్టు జలవిద్యుత్‌ కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి కొనసాగుతుంది. విద్యుత్‌ ఉత్పత్పి కేంద్రం ద్వారా 31 వేల క్యూసెక్కులు వస్తోంది. శ్రీశైలం నుంచి సాగర్‌ జలాశయానికి లక్షా 73 వేల క్యూసెక్కులు వస్తుండటం.. ఇప్పటికే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండటంతో 14 గేట్లను 10 అడుగుల మేర ఎత్తి స్పిల్‌ వే ద్వారా లక్షా 56 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.4 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.50 అడుగులు (311.55) టీఎంసీల నీరుంది. జల విద్యుత్‌ కేంద్రం, ఎస్‌ఎల్‌బీసీ, కుడి కాల్వ ద్వారా 34 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/