8 శాతం పెరిగిన పెట్రోలియం ధరలు

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్లను అనుసరించి చార్జీలను సవరించే విధానం మొదలయ్యాక ఈ సంవత్సరం జూన్ నుంచి
పెట్రోలియం దరలు 8 శాతం పెరిగినట్లు రేటింగ్ సంస్థ ఇక్రా తెలియజేసింది.ఇలా స్థిరంగా ధరలు పెరుగుతూ పోతే వృద్దికి
విఘాతం కలగడంతో పాటు ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు పెరుగుతాయని హెచ్చరించింది.ధరల పెరుగుదల వెనుక అంతర్జాతీయంగా
పెట్రోల్,డీజిల్ 14 శాతం పెరగడంతో పాటు దేశీయంగా పెట్రోల్ పంపుల డీలర్లకు కమీషన్లు పెంచడం కారణాలుగా
పేర్కొంది.అంతకు ముందు లీటరుకు 2.55 కమీషన్‌గా ఇవ్వగా దాన్ని 40 శాతం పెంచి 3.57గా చేసినట్లు తెలిసింది.
జూన్ 17న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 65.23గా ఉండగా అది 70.41కి చేరిన విషయాన్ని గుర్తు చేసింది.