8 మండలాల్లో 50కి పైగా పునరావాస కేంద్రాలు

kartikeya mishra, collector
kartikeya mishra, collector

కాకినాడ: పెథా§్‌ు తుఫాను తీవ్ర తరం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. ఈ నెల 17 సాయంత్రానికి అమలాపురం-కళింగపట్నం మధ్య తీరం దాటే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరు కార్తికేయ మిశ్రా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎనిమిది మండలాల్లో పాఠశాలలకు సోమ, మంగళవారం సెలవులు ప్రకటించారు. 50కిపైగా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని, అక్కడి ప్రజలకు తాగునీరు, ఆహారం, విద్యుత్‌ తదితర ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. జిల్లాకు రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌, రెండు ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను తరలించినట్లు తెలిపారు.