8% ఆర్ధిక వృద్ధికి ప్రపంచ బ్యాంకు దిశానిర్దేశం!

ECONOMY
ECONOMY

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, జిఎస్‌టి అమలు వంటి వాటితో తాత్కాలిక ఆర్ధిక విఘాతాలుకలిగినప్పటికీ భారత్‌ పురోగమించి వచ్చే రెండేళ్లలో 7.5శాతానికి చేరుతుందన్నఅంచనాలున్నాయి. మధ్యతరహా ఆదాయ వర్గాలున్న జాబితానుంచి ఇంకా బైటపడలేకపోతున్నట్లు కనిపిస్తోంది. 30 ఏళ్లకుగాను భారత్‌ జిడిపి వృద్ధి ఎనిమిది శాతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ, రాజకీయ అనిశ్చితి, భౌగోళిక అనిశ్చితిలు పెరిగినా భారత్‌ 8శాతం ఆర్ధికవృద్ధి ఒకటిలేదా రెండేళ్లపాటుమాత్రమే ఉంటుందని, ఈ రెండేళ్లలోనే కొంత సర్దుబాటవుతుందని అంచనాలున్నాయి. ప్రపంచ బ్యాంకు భారత్‌ ఆర్ధిక ప్రగతికి సంబంధించిమూడుప్రధాన అంశాలను దృస్టిలోనికి తీసుకుంది. సహజవనరులనిర్వహణ కీలకంగా ఉండాలని చైసింది. జిఎస్‌టి తర్వాత సంస్కరణలు నగరాలపైనే ఎక్కువ వచ్చాయి. కనెక్టివిటీనిమెరుగుపరిచి రవాణా మౌలికవనరులు పెంచడం వంటివి ఎక్కువ ఉంది. వ్యవసాయరంగంలో రైతులు సమస్యలనుంచి బైటపడేటట్లు చేయాలని అంచనా. ప్రపంచ బ్యాంకు సమ్మిళిత అభివృద్ధిలో ఉత్పత్తి ఆధారిత వృద్ధిఅవసరం అవుతుందని అంచనావేసింది. భారతపెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వేతన కొలువులు మరింతగాపెరగాల్సి ఉంటుంది. రెండురంగాల్లో సంస్కరణల ద్వారా ఈ వృద్ధిని సాధించవచ్చనిప్రపంచ బ్యాంకు అంచనావేసింది. అభివృద్ధికి ఆస్కారం కలిగించే పెట్టుబడుల వాతావరణం పెంచాలి. భారీస్థాయి ఉత్పత్తి సంస్థలు తమ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వ మద్దతు అవసరం అవుతుంది. అర్హతపొందిన నైపుణ్యం కలిగిన సిబ్బంది అంతర్జాతీయ డిమాండ్లకు అనుగుణంగా పోటీతత్వాన్ని అధిగమించే సిబ్బందిని పెంచుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక ప్రభుత్వరంగాన్ని మరింతపటిష్టంచేయాల్సిన అవసరం ఉందని ప్రపంచ బ్యాంకు వెల్లడించింది. పెరుగుతున్నమధ్యతరగతి అవసరాలకు అనుగుణంగా భారత్‌ ప్రభుత్వరంగాన్ని పటిష్టంచేయాల్సి ఉంటుందని అంచనావేసింది. పెట్టుబడులను పెంచుకోవడమే కాకుండా సంస్కరనలు కూడా కొన్ని తీసుకురావాల్సి ఉంటుంది. వీటికితోడు పనిసామర్ధ్యంకూడా పెంచుకోవాలని ప్రపంచ బాంకు సూచించింది. ప్రభుత్వ పరిధిలోని వివిధ విభాగాలను మరింతపటిష్టంచేసుకోవాలని ప్రపంచ బ్యాంకు సూచించింది.