8మంది ఇండో-అమెరికన్‌ మహిళలకు పురస్కారాలు

indo,america
indo,america

వాషింగ్టన్‌: అమెరికాలో ఎనిమిది మంది భారత సంతతి మహిళలకు అత్యున్నత పురస్కారాలు లభించాయి. వారి వారి రంగాల్లో సదరు మహిళలు అందించిన సేవలను అమెరికా ప్రభుత్వం గుర్తించింది. రాజకీయాలు, వ్యాపారం, మానవ హక్కులు, ఆస్ట్రోఫిజిక్స్‌ తదితర రంగాల్లో వారు అందించిన సేవలకు గాను అక్కడి ప్రభుత్వం ఉన్నత స్థాయి పురస్కారాలతో సత్కరించింది. ఇమ్మిగ్రేషన్‌ న్యాయవాది షీలా మూర్తి, ఏషియన్‌ అమెరికన్‌ హోటల్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌(ఏఏహెచ్‌ఓఏ) వైస్‌ ఛైర్‌పర్సన్‌ జాగృతి పన్‌వాలా, డెమోక్రటిక్‌ పార్టీ ఫండ్‌రైజర్‌ అండ్‌ ఆర్ట్‌ కలెక్టర్‌ మహీందర్‌ టక్‌, నాసా ఆస్ట్రోఫిజిస్ట్‌ మధులిక గుహతకుర్తా తదితర మహిళలు పురస్కారాలు అందుకున్న వారిలో ఉన్నారు.