7వ పాశురం: తిరుప్పావై

ఆధ్యాత్మిక చింతన

7th Pashuram-Thiruppavai
7th Pashuram-Thiruppavai


కీశుకీశెనెగుమ్‌ ఆనై చ్చాత్తన్‌, కలన్దు
పేశిన పేచ్చరవమ్‌ కేట్టిలైయో పేప్పెణ్ణే!
కాశుమ్‌ పిఱప్పమ్‌ కలకలప్ప కైపేర్తు
వాశనఱుంగుళల్‌ ఆయ్చ్చియర్‌, మత్తినాల్‌
ఓశైప్పడుత్త త్తయిరరవమ్‌ కేట్టిలైయో!
నాయగప్పెణ్‌ పిళ్లా య్! నారాయణన్‌ మూర్తి,
కేశవన్తైప్పాడవుమ్‌ నీకేట్టే కిడత్తియో
తేశముడైయాయ్! తిఱవేలో రెమ్బావాయ్.
ఏడవ పాటకిలకిలమని భరధ్వాజ ములజంట
నాల్గుదిక్కుల కలకలములు చేయ
తెల్లవార వచ్చెనని తెలియరాలేదా?
పరిమళాలెగజల్లు కరకంకణాల కవ్వాలి
మెడలోని హారాల మృదు మధుర రాగాల
సంగీత గీతాలు నీవువినలేదా?
కేశియను అసురుని కేశవుడు చంప
పలుమార్లు కీర్తించు పాట వినలేదా?
మణికన్న వెలుగున్న మా నాయకి!
కపట నిద్రను మాని కనుతెరువరాదా? భావం: పగలు గూట్లో ఉండబోమని తెలిసిన భరద్వాజ పక్షులు కీచుకీచుమని ఒకదానితో నొకటి మాటలాడుచున్న ధ్వని వినిపిస్తున్నది. గోపికలు పెరుగు చిలుకు తున్నప్పుడు వాని చేతిగాజులు ఆభరణము ల చప్పుడు వినిపిస్తూ పూలతోనున్న కొప్పు ముడి విడివడుటచే సువాసన అంతటా వ్యాపించుచున్నది. కేశియను రాక్షసుని చంపిన సర్వపదార్థములయందు లోపల వెలుపల వ్యాపించియున్న కృష్ణరూపమున అవతరించిన
ఆ సర్వేశ్వరుని కీర్తించుచున్న ధ్వని వినవస్తున్నది.లోపల నున్న గోపికను పిచ్చిపిల్లాయని, నాయకురాలాయని బ్రహ్మ తేజస్సు కలదానా అని పొగడుతు తెల్ల వారిందని తెలుపుతూ తలుపు
తీసి తమతో కలవమని వెలుపలనున్న గోపికలు మేల్కొలుపుతున్నారు.
ఫలం: తేజస్సు వర్ఛస్సు కలుగుతుంది.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం: https://www.vaartha.com/andhra-pradesh/