భారత్‌లో కొత్తగా 78,524 కేసులు నమోదు

ఇప్పటి వరకు 1,05,526 మంది మృతి

corona virus- india

న్యూఢిల్లీ: భారత్‌లో కొత్తగా 78,524 కేసులు నమోదు కాగా, 971 మంది కరోనాతో మృతి చెందారు. తాజా కేసులు, మరణాలతో కలుపుకుని దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 68,35,656 కేసులు నమోదు కాగా, 1,05,526 మంది మరణించినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం బులెటిన్ విడుదల చేసింది. దేశంలో ఇంకా 9,02,425 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, 58,27,705 మంది కోలుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/