ఏపీలో కొత్తగా 771 కరోనా కేసులు

రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది మృతి
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 11,912

అమరావతి: ఏపీలో కొత్తగా 45,592 మందికి కరోనా పరీక్షలను నిర్వహించగా 771 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 153 కేసులు నమోదు కాగా… విజయనగరం జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. ఇదే సమయంలో 1,333 మంది కరోనా నుంచి కోలుకోగా… 8 మంది మృతి చెందారు.

తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 20,48,230కి పెరిగింది. ఇప్పటి వరకు 20,22,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 14,150 మంది మహమ్మారి వల్ల ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/