దేశంలో కొత్తగా 7,633 కరోనా కేసులు
న్యూఢిల్లీః దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,633 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 61,233కి చేరింది. ఇండియాలో గత 24 గంటల్లో 11 మంది కరోనాతో చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,31,152కి చేరింది. కొత్త మరణాలు నాలుగు ఢిల్లీలో నమోదయ్యాయి. హర్యానా, కర్ణాటక , పంజాబ్‌లో ఒక్కొక్కరు చనిపోగా.. కేరళలో నలుగురు మరణించారు.
గత మూడు రోజుల నుంచి కరోనా కేసులు స్వల్పంగా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఏప్రిల్ 17న కేసులు తక్కువగానే ఉండగా..ఏప్రిల్ 16వ తేదీన ఆదివారం కొత్త కేసులు 9,111 మాత్రమే కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజూ 10వేలకు పైగా కొత్త కేసులు వచ్చాయి. అయితే యాక్టివ్ కేసులు 60వేలకుపైగా ఉండటంతో ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది.