ఈ 75 ఏళ్ల భామ ఆరోగ్య రహస్యం ఇసుక నేనట..ఇసుక తింటూనే బ్రతుకుతుంది

ఈ 75 ఏళ్ల భామ ఆరోగ్య రహస్యం ఇసుక నేనట..ఇసుక తింటూనే బ్రతుకుతుంది

మాములుగా ఇసుక దేనికి వాడతామో తెలియంది కాదు..అదే ఇసుక ఓ భామకు ఆహారంగా మారింది. ఆమెకు 15 ఏళ్లు ఉన్నప్పుడు మొదటిసారి ఇసుక తిన్నదట. అప్పటి నుండి ఇప్పుడు 75 ఏళ్ల వయసు వరకు కూడా అదే తినడం చేస్తుందట. ఆమె ఆరోగ్య రహస్యం ఇసుకే అని చెపుతుంది. ఇంతకీ ఈమె ఎక్కడ ఉంటుందనేది మీరే చదవండి.

ఉత్తర్​ప్రదేశ్‌ చోలాపూర్​లోని కఠారి గ్రామంలో కుష్మావతి దేవి (75) జీవనం కొనసాగిస్తోంది. ఈ వయసులో కూడా ఆమె ఇంటి పనులు, పొలం పనులు చకచకా చేసుకుంటూ.. మిగిలినవారి కంటే చాలా చురుకుగా ఉంటూ అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. కుష్మావతి దేవి కి 15 ఏళ్లు ఉన్న సమయంలో మొదటిసారి ఇసుక తిన్నదట. అప్పటి నుండి ఇప్పటివరకు ఇసుక నే ఆహారం గా తింటువస్తుందట. ఇసుక మాత్రమే తింటున్న ఆమెకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు చెపుతున్నారు.ఇసుక తినొద్దని ఆమె కుమారుడు, మనవళ్లు, బంధువులు ఎంత చెప్పినా.. ఆమె వినట్లేదు. ఈ అలవాటు మాన్పించేందుకు వైద్యులను సంప్రదించాలని కుటుంబ సభ్యులు భావించినా.. అందకూ అంగీకరించట్లేదట.

కుష్మావతి దేవి ఇసుక తీసుకోవడానికి మానసిక సమస్య కారణం కావచ్చని వైద్యులు భావిస్తున్నారు. శరీరంలో జింక్, ఐరన్ లోపం ఉన్నవారు ఇలా ఇసుకను ఆహారంగా తీసుకుంటారని చెబుతున్నారు.