ఏపి లో మరో 73 కరోనా కేసులు

1332 కు చేరిన కరోనా కేసులు

corona virus
corona virus

అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటలలో మరో 73కొత్త కరోనా కేసులు నమోదు అయ్యాయి. 7 ,727 మందికి పరీక్షలు జరపగా 73 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దింతో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా భాదితుల సంఖ్య 1332 కు చేరింది. ఇప్పటి వరకు కరోనా కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ౩౧ మంది మరనించారని తెలిపింది. కరోనా బారినుండి కోలుకున్న వారిసంఖ్య 287 కు చేరింది. కాగా ప్రస్తుతం 1014 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కాగా కొత్తగా నమోదు అయినా కేసులలో గుంటూరులో 29 కృష్ణ లో 13 కర్నూలు లో 11 కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు అత్యధికంగా కర్నూలు జిల్లాలో 343కరోనా కేసులు నమోదు అయ్యాయి.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి; https://www.vaartha.com/telangana/