భూకంపం..73కు చేరిన మృతుల సంఖ్య‌

భూకంపం..73కు చేరిన మృతుల సంఖ్య‌
turkey-earthquake

అంకారా: టర్కీలో భారీ భూకంప సంభదవించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘ‌ట‌న‌లో మృతుల సంఖ్య క్ర‌మంగా పెరుగుతున్న‌ది. భూకంపం వ‌ల్ల ఇజ్మిర్ ప్రావిన్స్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 73 మంది మ‌ర‌ణించ‌గా, 961 మంది గాయ‌పడ్డారు. క్ష‌త‌గాత్రులు వివిధ ద‌వాఖాన‌ల్లో చికిత్స పొందుతున్నార‌ని అధికారులు తెలిపారు. భూకంపం ధాటికి 40కిపైగా భ‌వ‌నాలు పూర్తిగా ధ్వంస‌మ‌య్యాయి. వెయ్యికిపైగా భ‌వ‌నాలు పాక్షికంగా దెబ్బ‌తిన్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న‌వారికోసం గాలింపు కొన‌సాగుతున్న‌ది, మృతుల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.

కాగా అక్టోబ‌ర్ 30న టర్కీలో భారీ భూకంపం సంభ‌వించింది. దీనితీవ్ర‌త 7.0గా న‌మోద‌య్యింది. దీంతో ట‌ర్కీ తీరానికి, గ్రీకు దీవి సామోసుకు మధ్యలో ఏజియన్‌ సముద్రంలో 196 సార్లు భూమి కంపించిందని అధికారులు గుర్తించారు. దీని ప్ర‌భావంతో సామోస్‌, ఏజియ‌న్ స‌ముద్రంలో చిన్న‌పాటి సునామీ వ‌చ్చింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/