ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

woakes
woakes

ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ

గాయం కారణంగా ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ టోర్నీకి దూరం

లండన్‌: ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లాండ్‌ జట్టుకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. గాయం కారణంగా ఆ జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ క్రిస్‌ వోక్స్‌ టోర్నీకి దూర మయ్యాడు. టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్‌ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌ చేసే క్రమంలో క్రిస్‌ వోక్స్‌ తీవ్ర నొప్పితో బాధపడ్డాడు. మ్యాచ్‌ అనంతరం అతడికి తీసిన స్కానింగ్‌ గాయం తీవ్రత ఎక్కువగా ఉందని తేలింది. దీంతోఛాంపియన్స్‌ ట్రోఫీలో మిగతా మ్యాచ్‌లకు అతడు అందుబాటులో ఉండడని ఈసిబి ఓప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి అతడి స్థానంలో ఎవరిని ఎంపిక చేయలేదు. టోర్నీతర్వాతి మ్యాచ్‌లో అతడి స్థానంలో మరొకరిని ఎంపిక చేస్తామని ఈసిబి తెలిపింది. కాగా, బంగ్లాదేవ్‌తో జరి గిన మ్యాచ్‌లో క్రిస్‌ వోక్స్‌ రెండు ఓవ ర్లు మాత్రమే బౌలింగ్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.