71వ ప్రజాసంకల్ప యాత్ర కార్యాచరణ

Jagan
Jagan

వైఎస్సార్సీ అధినేత, ప్రతిపక్షనేత జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 71వ రోజు కార్యాచరణ ఖరారైంది. ఈ రోజు ఉదయం సూళ్లురుపేట నుంచి పాదయాత్రను ఆరంభిస్తారు. అక్కడి నుంచి పూట క్రాస్‌రోడ్డు, వర్థరెడ్డి కండ్రిగ, పునేపల్లి, నేమలపుడి వరకు సాగుతుంది. మధ్యాహ్నాం 1గంటకు భోజన విరామం ఉంటుంది. తదనంతరం జగన్‌ పాదయాత్ర పున:ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి కుబులవొట్లు, వడ్డిపాలెం, సగట్టురు వరకు పాదయాత్ర కొనసాగనుంది.