7 క్వింటాళ్ల రేషన్‌ బియ్యం పట్టివేత

Ration Rice
Ration Rice

విజయనగరం: అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ల 50 కేజీల రేషన్‌ బియాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటన ఈరోజు పట్టణంలోని లక్ష్మీ నారాయణపురం గ్రామంలో చోటు చేసుకుంది. ముందస్తు సమాచారాన్ని అందుకున్న పట్టణ ఎస్‌ఐ లోవ రాజు రెడ్డి.. లక్ష్మీ నారాయణపురం గ్రామం వీధి శివారు ప్రాంతంలో ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 7 క్వింటాళ్ళ 50 కేజీ ల రేషన్‌ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆటోను సీజ్‌ చేసి, నిందితుడిని అరెస్ట్‌ చేశారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/