విక్స్ డ‌బ్బా మింగి చిన్నారి మృతి

డబ్బాను నోట్లో పెట్టుకున్న ఏడు నెలల చిన్నారి

నల్గొండ: నల్గొండ జిల్లా నార్కట్ పల్లిలో దారుణం జరిగింది. విక్స్ డబ్బా ఓ పసికందు ప్రాణాన్ని బలిగొంది. నార్కట్ పల్లి మండలం తొండ్లాయి గ్రామంలో ఏడు నెలల చిన్నారి ఆడుకుంటూ వెళ్లి ఇంట్లో ఉన్న విక్స్ డబ్బాను నోట్లో పెట్టుకున్నాడు. అది కాస్తా గొంతుకు అడ్డం పడింది. గమనించిన తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే, మార్గమధ్యంలోనే ఆ చిన్నారి ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/