పడవ ప్రమాదంలో ఏడుగురి మృతి, 30 మంది గల్లంతు

boat
boat


పాట్నా: నీటిలో తిరిగే పడవల్లో సామర్ధ్యానికి మించి ప్రయాణికుల ఎక్కించుకుని ప్రమాదానికి దారి తీసిన సంఘటన మరువకముందే బీహార్‌ ఇటువంటి మరో సంఘటన సంభవించింది. బీహార్‌ కతిహార్‌ జిల్లా జగన్నాథ్‌పూర్‌ నుంచి పశ్చిమబెంగాల్‌లోని మాల్డా, నార్త్‌ దినాజ్‌పూర్‌లోని చంచల్‌ గ్రామం మధ్య ఒక పడవ రోజు రాకపోకలు సాగిస్తుంటుంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఉన్న మహానంద నదిని దాటేందుకు ప్రజలు ఈ బోటులోనే ప్రయాణిస్తుంటారు. జగన్నాథ్‌ పూర్‌ నుంచి బయలుదేరి ముకుంద్‌పూర్‌ ఘాట్‌కు చేరుకుంటుంది. అయితే బోటులో సామర్ధ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడంతో పడవ మధ్యలోనే మునిగిపోయింది. పశ్చిమబెంగాల్‌, బీహార్‌లలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మహానంద నది ఉదృతంగా ప్రవహిస్తున్నది. నదిలో మునిగిన ఈ బోటు ప్రమాదంలో 30 మంది జాడ తెలియకుండా పోయారు. బోటులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉండగా అదనంగా బైక్‌లు, సైకిళ్లను కూడా బోటులో ఎక్కించారు. ఇది ఫెర్రీ తరహా బోటు. బోటు ప్రమాదానికి గురైన వెంటనే స్థానికులు, మత్స్యకారులు అప్రమయ్యమై 20 మందిని రక్షించగలిగారు. 30 మంది నీళ్లలో కొట్టుకుపోయారు.

ఎన్‌డిఆర్‌ఎఫ్‌ నిర్వాహకులు ఏడు మృతదేహాలను వెలికి తీశారు. బోటులో అంతమంది ప్రయాణికులు ఉండరని, ముకుందాపూర్‌ ఘాట్‌లో నిర్వహిస్తోన్న పడవ పందాలను తిలకించడానికి మాల్దా జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో స్థానికులు వచ్చారని, వారు తిరుగుముఖం పట్టగా రద్దీ ఏర్పడిందని తెలిపారు. సమాచారం అందుకున్న ఎన్‌డిఆర్‌ఎఫ్‌ బృందం నదిలో నుండి ఏడు మృతదేహాలు స్వాధీనం బయటికి తీసారు. మిగిలిన మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను ఇంకా గుర్తించలేదు. రెందు రాష్ట్రాల సరిహద్దులో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఆయా రాష్ట్రాలకు చెందిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు.
తాజా జాతీయ వార్త కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/