నిమజ్జనంలో విషాదం..నీటిలో మునిగి ఏడుగురు మృతి

దేశ వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఊరు , వాడ అంతటా కూడా బై బై అంటూ గణనాథులు గంగమ్మ ఒడికి చేరుతున్నారు. అయితే ఝార్ఖండ్ లో మాత్రం కరమ్ డాలీ ఉత్సవ నిమజ్జన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఉత్సవంలో భాగంగా వెళ్లిన ఏడుగురు యువతులు నీట మునిగి ఆ కుటుంబాల్లో విషాదం నింపారు. ఈ ఘటన జార్ఖండ్‌లోని లాతేహర్ జిల్లాలోని బక్రు అనే గ్రామంలో చోటు చేసుకుంది.

జార్ఖండ్‌లోని స్థానికులు నిర్వహించే కర్మ పండుగలో కరమ్ డాలీ ఉత్సవం కొనసాగుతోంది. అయితే ఆ ఉత్సవంలో చెట్టు కొమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం కోసం వెళ్లిన ఇద్దరు అమ్మాయిలు నీళ్లలో మునిగిపోతూ.. రక్షించాలని కోరారు. ఈ నేపథ్యంలోనే ఒకరిని కాపాడపోయి మరోకరు నీళ్లలోకి దిగారు. ఇలా 18 సంవత్సరాల లోపు ఉన్న బాలికలు 6గురితోపాటు మరో యువతి సైతం నీళ్లలోకి దిగింది. దీంతో ఏడుగురు నీటిలోనే మునిగిపోయారు. నీటిలో మునిగిన ముగ్గురిని గ్రామస్థులు కాపాడగా.. నీటిలోనే ముగ్గురు మృత్యువాత పడ్డారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డట్టు సమాచారం. వీరిలో ముగ్గురు అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు.