7.1 తీవ్రత.. ఫిలిప్పీన్స్‌లో భూకంపం

massive earthquake in Japan
earthquake

మనీలాః ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని లుజాన్‌ ఐలాండ్స్‌లో ఉన్న అబ్రా ప్రావిన్స్‌లో బుధవారం ఉదయం భూమి కంపించింది. దీని తీవ్రత 7.1గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది. దీంతో భూకంప కేంద్రానికి 300 కిలోమీట్ల దూరంలో ఉన్న మనీలాలో భారీ భవనాలు ఊగిపోయాయని తెలిపింది. అర్బా ప్రావిన్స్‌లో అయితే భవనాల కిటికీలు కొట్టుకున్నాయని పేర్కొన్నది.

భారీ భూకంపం నేపథ్యంలో డాలర్స్‌ పట్టణంలో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారని పోలీసులు తెలిపారు. భూ ప్రకంపణల వల్ల ఎంతమేర నష్టం జరిగిందనే విషయం ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. 2013లో సెంట్రల్‌ ఫిలిప్పీన్స్‌లోని బోహల్‌ ద్వీపంలో 7.1 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. దీంతో 200 మంది మరణించారు. 4 లక్షల మందికిపైగా నిరాశ్రయులు అయ్యారు. ఇక 1990లో ఉత్తర ఫిలిప్పీన్స్‌లో 7.8 తీవ్రతతో భూమి కంపించింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/