బిగ్ బాస్ 5 : ఈ వారం 10 మంది నామినేషన్..

బిగ్ బాస్ 5 : ఈ వారం 10 మంది నామినేషన్..

బిగ్ బాస్ అంటేనే ఎంటర్టైన్మెంట్ , సీరియస్ , టాస్క్ , గొడవలు , ఫైట్స్ ఇలా ఎవరు ఏమికోరుకుంటారో అన్ని ఉంటాయి. వారం మొత్తం టాస్క్ లు , గొడవలు , ఫైట్స్ తో సాగగా..శని వారం వస్తే వారంలో హౌస్ లో సభ్యులు చేసే తప్పులకు నాగ్ క్లాస్ తీసుకుంటాడు. ఆదివారం ఒకర్ని ఇంటికి పంపించడం చేస్తారు. ఇక సోమవారం వచ్చిందంటే నామినేషన్..ప్రతి వారంలాగానే ఈ సోమవారం కూడా నామినేషన్ పర్వం వాడివేడి గా సాగినట్లు ప్రోమో చూస్తే అర్ధమవుతుంది. ఈ వారం ఒకరు ఇద్దరు కాదు ఏకంగా పది మంది సభ్యులు నామినేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం కంటెస్టెంట్లకు అగ్నిపరీక్ష పెట్టాడు బిగ్‌బాస్‌. నామినేట్‌ చేయాలనుకున్న ఇద్దరి పొటోలను మంటల్లో వేయమని ఆదేశించాడు.

సన్నీ తనకు టాస్కులో సపోర్ట్‌ చేసిన జెస్సీని నామినేట్‌ చేశాడు. నీకు సపోర్ట్‌ చేసినందుకు బాగా బుద్ధి చెప్పావంటూ కౌంటరిచ్చాడు జెస్సీ. అక్కా, అక్కా అంటూ దొంగ నాటకాలు ఆడకని విశ్వను హెచ్చరించింది యానీ మాస్టర్‌. సిరి, శ్వేత మధ్య కూడా మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. రేషన్‌ మేనేజర్‌ అంటే అందరికీ సమానంగా ఫుడ్‌ పంచాలే తప్ప ఫస్ట్‌ మనమే వెళ్లి తినడం కాదు.. అంటూ విశ్వపై సెటైర్‌ వేసింది ప్రియ. ఆమె అలా మాట్లాడటం నచ్చని విశ్వ.. నా కడుపు నా ఇష్టం, తింటాను అని జవాబు ఇచ్చారు. ఈ వారం కెప్టెన్‌ ప్రియ, షణ్ముఖ్‌, యానీ మాస్టర్‌, ​కాజల్‌ మినహా మిగిలిన 10 మంది నామినేట్‌ అయ్యినట్లు తెలుస్తుంది. అంటే సన్నీ, విశ్వ, సిరి, జెస్సీ, రవి, మానస్‌, శ్రీరామచంద్ర, లోబో, శ్వేత, ప్రియాంక సింగ్‌ ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది.