సంక్రాంతికి 6,970 ప్రత్యేక సర్వీసులు: ఏపీఎస్ ఆర్టీసీ

పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు
పండగ తరువాత 2,825 సర్వీసులు

అమరావతి : సంక్రాంతి పండుగ‌ సమీపిస్తున్న తరుణంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ ప‌లు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఏపీకి ప‌లు ప్రాంతాల నుంచి త‌ర‌లివ‌చ్చే వారి కోసం భారీ సంఖ్యలో ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ సంక్రాంతి సీజన్‌లో ఏకంగా 6,970 ప్రత్యేక సర్వీసులు న‌డ‌ప‌నుంది.

వాటిలో పండగ ముందు 4,145 ప్రత్యేక సర్వీసులు, పండగ తరువాత 2,825 ప్రత్యేక సర్వీసులు నడిపేందుకు ప్రణాళికను ఆమోదించింది. గత ఏడాది కంటే 35 శాతం అధికంగా ఈ ఏడాది ప్రత్యేక బస్సులు నడపాలని ఏపీ ఆర్టీసీ నిర్ణయించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/