అట్టహాసంగా 68వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల వేడుక

దేశ రాజధాని ఢిల్లీ లో 68వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల వేడుక అట్టహాసంగా జరిగింది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కారణం వల్ల నిర్వహించలేదు. ఈ క్రమంలోనే 68వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకను ఈ ఏడాది నిర్వహించారు. 1954లో స్థాపించబడిన ఈ ప్రతిష్టాత్మక అవార్డులను భారత ప్రభుత్వం చలనచిత్రోత్సవాల పేరుతో నిర్వహిస్తోంది. ఈ 68వ జాతీయ చ‌ల‌నచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో ఘనంగా జరిగింది.

రాష్ట్రపతి ద్రౌప‌ది ముర్ము, కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్‌ విజేత‌ల‌కు అవార్డులను అందజేశారు. జాతీయ ఉత్తమ న‌టులుగా సూర్య, అజ‌య్ దేవ‌గ‌న్‌ అవార్డులు అందుకున్నారు. అల‌ వైకుంఠ‌పురములో సినిమాకు సంగీతం అందించిన‌ త‌మ‌న్ కు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అవార్డు అందుకున్నారు. అలాగే క‌ల‌ర్ ఫొటో చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిలిం అవార్డును డైరెక్టర్ అంగిరేకుల సందీప్ రాజు అందుకున్నారు. బెస్ట్‌ డ్యాన్స్ మాస్టర్ గా నాట్యం మూవీ సినిమాకు సంధ్యారాజు అందుకున్నారు. బెస్ట్ మేక‌ప్ ఆర్టిస్ట్ గా నాట్యం సినిమాకు రాంబాబు అవార్డు తీసుకున్నారు.