బిసిసిఐ, ఐసిసి తక్షణ చర్యలపై ఆశాభావం

TEAM
TEAM

చాంపియన్స్‌ ట్రోఫీ వ్యవహారంలో
బిసిసిఐ, ఐసిసి తక్షణ చర్యలపై ఆశాభావం

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక ఛాంపియన్స్‌ ట్రోఫీ-2017 ప్రారంభమయ్యేందుకు ఇంకా నెల రోజులు సమయం కూడా లేదు.ఇంగ్లండ్‌,వేల్స్‌ వేదికగా జూన్‌ 1 నుంచి టోర్నీ ఆరంభం కానుంది. టోర్నీలో పాల్గొనే 8 దేశాలకు చెందిన జట్లు ఇప్పటికే తమ బృందాలను ప్రకటించాయి.ఒక్క భారత్‌ తప్ప.టోర్నీ ఆరంభానికి ఇంకా నెల రోజుల వ్యవధి కూడా లేకపోవడంతో మీడియా ఏజెన్సీ ఆందోళన చెందుతున్నారు.ఈ టోర్నీలో భారత్‌ పాల్గొనకపోతే టోర్నీకే అర్థం ఉండదని వివరిస్తున్నారు. సమస్య పరిష్కారానికి బిసిసిఐ, ఐసిసి తక్షణ చర్యలు చేపడతాయని భావిస్తున్నట్లు స్టార్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సంజ§్‌ు గుప్తాఆశాభావం వ్యక్తం చేశాడు.భారత్‌కు వ్యతిరేకంగా ఐసిసిలో నూతన ఆదాయ పంపిణీ నమూనాకు అనుకూలంగా సభ్యదేశాలు ఓటు వేశాయి.దీంతో బిసిసిఐ ఆదాయానికి భారీ గండి పడింది.ఈ నేపథ్యంలో కోహ్లీ సేన ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడుతుందో లేదో అన్నదానిపై సందిగ్దత నెలకొంది.ఇదే అదునుగా భావించిన భారత్‌ చాంపియన్స్‌ ట్రోఫీలోపాల్గొనే భారత జట్టును ప్రకటించ లేదు.నూతన ఆదాయ నమూనా అమలైనా 450 మిలియన్‌ డాలర్లు ఇవ్వాలని బిసిసిఐ కోరుతుంది. ======