బ్రెడ్‌, బీట్‌రూట్‌ బోండా

RUCHI1
RUCHI1

బ్రెడ్‌, బీట్‌రూట్‌ బోండా

కావలసినవి

బీట్‌రూట్‌-పావుకిలో, బ్రెడ్‌స్లైసులు-12, జీడిపప్పు-100గ్రా, ఓట్స్‌-కప్పు అల్లంవెల్లుల్లి ముద్ద-ఒక టేబుల్‌స్పూన్‌, పచ్చిమిర్చి-నాలుగు, ఉప్పు-సరిపడా నూనె-వేయించడానికి సరిపడా, పుదీనాతురుము-ఒక టేబుల్‌స్పూన్‌

తయారుచేసే విధానం
బీట్‌రూట్‌ పొట్టుతీసి ఉడికించుకోవాలి. బాణలిలో నూనె వేయకుండా జీడిపప్పు, ఓట్స్‌ వేసి వేయించి తీయాలి. తరువాత బాణలిలో కొద్దిగా నూనె వేసి అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. మళ్లీ జీడిపప్పు, ఓట్స్‌ వేసి వేయించాలి. అవి వేగాక ఉడికిన బీట్‌రూట్‌ ముక్కల్ని చిదిమివేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి ముద్ద, ఉప్పు వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని ఉండలుగా చేసుకోవాలి. రెండు బ్రెడ్‌స్లైసులు తీసుకుని అంచులు కత్తిరించి నీళ్లలో ముంచి బాగా పిండాలి. రెండింటి మధ్యలో బీట్‌రూట్‌ పూర్ణాన్ని పెట్టి దానిచుట్టూ బ్రెడ్‌ ముక్కలు వచ్చేలా గుండ్రంగా చేయాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో వేయించి తీయాలి. ఇవి పిల్లలకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌.