Kohli
Kohli

కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో కోహ్లీని
వెనక్కి నెట్టిన రైనా

కోల్‌కతా: టి20 స్పెషలిస్టు బ్యాట్స్‌మెన్‌గా పేరు గాంచిన సురేశ్‌ రైనా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపిఎల్‌)లో మరో ఘనత సాధించాడు.ఐపిఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సురేశ్‌ రైనా కెప్టెన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో హాఫ్‌ సెంచరీతో తన జట్టును గెలిపించిన సురేశ్‌ రైనా ఈ క్రమంలో రాయల్‌ చాలెంజర్స్‌ జట్టు కెప్టెన్‌ కోహ్లీని అధిగమించాడు.రాయల్‌ చాలెంజర్స్‌ కెప్టెన్‌ కోహ్లీని వెనక్కి నెట్టి మొదటి స్థానానికి దూసుకొచ్చాడు.ఐపిఎల్‌లో ఇప్పటి వరకు 153 మ్యాచ్‌లు ఆడిన సురేశ్‌ రైనా మొత్తం 4,341 పరుగులు చేశాడు.ఈ క్రమంలో 4,264 పరుగులు చేసిన కోహ్లీ ద్వితీయ స్థానంలో ఉన్నాడు.ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 3,923 పరుగులు,కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ కెప్టెన్‌ గంభీర్‌ 3863 పరుగులతో నాలుగవ స్థానంలో కొనసాగుతున్నారు.ఐపిఎల్‌లో ఇప్పటి వరకు 153 మ్యాచ్‌ల్లో 149ఇన్నింగ్స్‌ ఆడిన సురేశ్‌ రైనా 139.09 స్టైక్‌ రేట్‌తో 4,341 పరుగులు చేశాడు.ఇందులో ఒక సెంచరీ,30 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి.167 సిక్సర్లు,384 బౌండరీలు చేశాడు.అయితై రైనా,కోహ్లీల మధ్య పరుగుల తేడా తక్కువగా ఉండటంతోమొదటి స్థానం కోసం వీరిద్దరు పోటీ పడుతున్నారు.రైనాను అధిగమించి కోహ్లీ అగ్రస్థానానికి వెళ్లగా మళ్లీ ఇప్పుడు సురేశ్‌ రైనా మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు.