
లారా కోసం బరిలోకి సచిన్
మే 13 మ్యాచ్‌లో కెప్టెన్‌గా కూడా బాధ్యత
న్యూఢిల్లీ: క్రికెట్ లెజెండ్ సచిన్ వెస్టిండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా కోసం త్వరలో బ్యాట్ పట్టనున్నాడు. క్రికెట్లో అన్ని ఫార్మాట్లకు సచిన్ వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.అయితే అభిమానుల కోసం మే 13న మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు.విశేషం ఏమిటంటే ఈ మ్యాచ్‌లో సచిన్ కెప్టెన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించనున్నాడు.వెస్టిండీస్ మాజీ క్రికెట్ లారా పేరిట 15 వేలసామర్థ్యం గల స్టేడియాన్ని ట్రినిడాడ్‌లో నిర్మించారు.ఈ స్టేడియాన్ని మే 13న ప్రారంభించనున్నారు.స్టేడియం ఆరంభ వేడుకల్లో భాగంగా ఓక మ్యాచ్‌ని నిర్వహించా లని నిర్వాహకులు భావించారు. ఇందులో భాగంగా క్రికెట్ దిగ్గజాలు సచిన్, బ్రియాన్ లారాలు అలరించనున్నారు.ఒక జట్టుకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుండగా,మరొక జట్టుకు లారా కెప్టెన్స్ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ మ్యాచ్‌ని ఇంటర్నేషన్,లోకల్లో ప్రసారం చేస్తామని ట్రినిడాడ్,టొబాగో క్రీడల మంత్రి స్మిత్ ఈ విషయాన్ని వెల్లడించారు. మ్యాచ్‌కి సంబంధించిన టికెట్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. వెస్టిండీస్ క్రికెట్‌కు విశేష సేవలు అందించిన క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా పేరుని ఈ స్టేడియానికి పెట్టడం జరిగిందని ఆయన వెల్లడించాడు.నిజానికి ఈ స్టేడియాన్ని ఐసిసి వరల్డ్ కప్ 2007 నాటికి అందుబాటులోకి తీసుకురావాలని అనుకున్నారు. కానీ నిర్మాణ వ్యయం భారంగా మారడంతో 2017 మార్చి నాటికి అత్యాధునిక హంగులతో మే 13 నాటికి సిద్దం అవతుంది.వెస్టిండీస్ క్రికెట్‌కు 16 సంవత్సరాల పాటు సేవలందించాడు లారా. వెస్టిండీస్ తరుపున 131 టెస్టులాడిన లారా 11.954 పరుగులు చేశాడు.