దేశంలో కొత్తగా 6,594 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో రోజువారీ కరోనా కేసులు తగ్గాయి. గత మూడు రోజులుగా 8 వేలకుపైగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసులు నేడు 6,594కు పడిపోయాయి. ఇవి సోమవారం నాటికంటే 18 శాతం తక్కువ. దీంతో మొత్తం కేసులు 4,32,36,695కు చేరాయి. ఇందులో 4,26,61,370 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. మరో 50,548 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు 5,24,771 మంది కరోనాతో మృతిచెందారు. కాగా, గత 24 గంటల్లో 4035 మంది కోలుకున్నారని, 3,21,873 మందికి కరోనా పరీక్షలు చేశామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.

కాగా, ఇక మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 0.12 శాతానికి చేరాయని, రికవరీ రేటు 98.76 శాతం, మరణాల రేటు 1.22 శాతంగా ఉందని తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 కు చేరిందని వెల్లడించింది. ఇప్పటిరకు 85.54 కోట్ల కరోనా పరీక్షలు చేశామని, 195.35 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/