రైతుల్లో కొత్త ఆశలు

ఒక్కమాట

(ప్రతి శనివారం)

TS
TS

రైతుల్లో కొత్త ఆశలు

రైతులకు పెట్టుబడిలో కొంత భారం తగ్గించేందుకు ఒక ఎకరాకు నాలుగువేల రూపాయల విలువైన ఎరువ్ఞలను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామం. కరెంటు కష్టాలు కూడా చాలావరకు తొలిగాయని చెప్పొచ్చు. మిషన్‌ కాకతీయతోపాటు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే నీటి సమస్య లు తీరే అవకాశాలు కన్పిస్తున్నా యి. ఇవన్నీ రైతులకు ఎంతోకొంత ఊరట కలిగిస్తాయి. వ్యవసాయాన్ని ముందుకు నడిపిస్తాయి. అయితే వీటితోటే సమస్యలన్నీ తొలగిపోతాయని భావించడం పొరపాటే అవ్ఞతుంది. ప్రకృతిచేస్తున్న బీభత్సంతోపాటు తోటిమానవ్ఞడు చేస్తున్న దగాతో రైతులు కుదేలవ్ఞతున్నారు. కళ్లముందు నాసిరకం విత్తనాలు, పురుగుమందులతో రైతులను దోపిడీ చేస్తున్నా పట్టించు కోవడం లేదు. అందిన చోటల్లా అప్పులు చేసి తీరా పంట వచ్చే సమయంలో విత్తనాలు నాసిరకమనో, నకిలీవనో తేలడంతో తెలియక వచ్చిన రోగానికి కొట్టిన పురుగుమందు బోగస్‌ కావడంతో రైతు కుప్పకూలిపోతున్నాడు. ఈ ఏడాదికూడా నకిలీ రకం విత్తనాలు రైతులను నిలువ్ఞనా ముంచాయి. ఎప్పటికప్పుడు ఈ నకిలీ, నాసిరకం విక్రయాల వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని చట్టాలను మరింత కఠినతరం చేస్తామని చెపుతున్నారేతప్ప.. అవి ఆచరణకు వచ్చేసరికి కాగితాలకే పరిమితమౌతున్నాయి.
కల్లాకపటం కాననివాడా, లోకంపోకడ తెలియనివాడా అంటూ రైతులను ఉద్దేశించి ఓ పాట రాస్తూ, ‘ పల్లె టూళ్లల్లో చెల్లనివాళ్లు పాలిటిక్స్‌తో బతికేవాళ్లు ప్రజా సేవ అని అరిచేవారు ఓట్లు గుంజి నిను మరిచేవాళ్లే, పదవ్ఞలు స్థిర మని భ్రమిసేవాళ్లే నీవే దిక్కని వత్తురు పదవో§్‌ు… రోజులు మా రాయి అంటూ ఐదున్నర దశాబ్దాల క్రితమే ఓ సినీకవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ స్థితి వచ్చేరోజు, ఈ రోజులు మారేరోజులు ఆ కవి కల నిజమవటంకోసం ఇన్ని రోజులుగా రైతులు ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు. ఆశ నిరాశాల మధ్య నిస్పృహలతో నీరసించి దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు, పాల్పడుతు న్నారు. తమది రైతుల సంక్షేమ ప్రభుత్వ మని పాలకులు ఎంతగా చెప్పుకుంటు న్నారో వ్యవసాయ రంగం అంతగా కుదే లైపోతున్నది. రోజురోజుకు వ్యవసాయం పట్లగౌరవం మరింతగా తగ్గుతోంది.
కరవు రక్కసి కోరల్లో చిక్కుకుని అతలాకుతలం అవ్ఞతున్న రైతులకు ఉపన్యాసాలు ఇవ్వ డం ఆకలిమంటలపై మాటలు చిలకరించి నట్లుగా ఉంటుంది. ఏపార్టీ అధికారంలోకి వచ్చినా రైతులకు సంబంధించిన సమస్య లు జఠిలమైపోతున్నాయి. విత్తే నాటినుండి పంటలు అమ్ముకునే వరకూ అడుగడుగునా కష్టాలే.కరవ్ఞకాటకాల్లో తలతాకట్టుపెట్టి పం డించిన పంటలకు గిట్టుబాటు ధరలేక రైతులు అల్లాడిపోతున్నారు. మొన్న పొగాకు, నిన్న పత్తి, నేడు మిర్చి ఇలా ఒక పంటేమిటి ప్రతి పంట రైతులబాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి.గ్రామీణ ప్రాంతంలో ఉండి నాగలి పట్టి మడిలో తిరిగిన కుటుంబాల నుంచి వచ్చిన పెద్దలే చట్టసభల మెట్లు ఎక్కగానే పుట్టిపెరిగిన వ్యవసాయానికి తిలోదకాలు ఇస్తున్నారు.రంగుల హరివిల్లులాంటి రాజకీయ రంగం లో కాలుమోపగానే తమ ధర్మాన్ని మరుస్తున్నారు. కర్తవ్యాన్ని విస్మ రిస్తున్నారు.

ఇలాంటి దురదృష్ట పరిస్థితిలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వ్యవసాయరంగానికి ముఖ్యంగా అప్పు ల ఊబిలో కూరుకుపోయి దిక్కుతెలవని పరిస్థితుల్లో కొట్టుకు మిట్టా డుతున్న రైతులకు కొంతలోకొంత ఊరట కల్పించేందుకు నడుం కట్టారనే చెప్పొచ్చు.రాజకీయాల్లో ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేస్తుంటారు. మరెన్నో ఆశలు కల్పిస్తుంటారు. అవన్నీ చేయలేమని వారికి తెలుసు. అలాగే వినే ప్రజలకు కూడా ఇవన్నీ అయ్యేవా, పోయేవా అనే సంశయంలోనే ఉంటారు. అందుకే చేసింది చెప్పుకోవడం సులభం. చెప్పింది చేయడం అంద రివల్ల సాధ్యంకాదు. రైతుల రుణాల విషయంలో తెలంగాణ ప్రభు త్వం ఇచ్చిన మాట ప్రకారం పదిహేడువేల కోట్ల రూపాయలు అం దించింది. సహజంగానే ఇది రైతులకు కొంతఊరట కలిగించింది. అయితే బ్యాంకుల హస్త లాఘవంతో కొన్నిప్రాంతాల్లో రైతులు ఇ బ్బందిపడుతున్నారు. వడ్డీలంటున్నారు. బ్యాంకు నిర్వహణ ఖర్చు లంటున్నారు. ఇన్సూరెన్స్‌ అంటున్నారు.

ఇలా కనపడని,కనపడే ఖర్చు రాస్తూ అక్కడికక్కడే బుక్‌ అడ్జెస్‌మెంట్‌ చేస్తున్నారనే విమ ర్శలున్నాయి. అందుకే ప్రభుత్వం ఈ విషయంలో శ్రద్ధతీసుకుని తాము విడుదలచేసిన డబ్బు ఆయా బ్యాంకులకు చేరి రైతులకు ఏమేరకు జమయింది? అందులో ఎంత వడ్డీకిందపోయింది? తది తర వివరాలు అన్నీ ఆడిట్‌ చేయిస్తే.. రైతులకు మరింత మేలు జరిగే అవకాశం ఉంది. రైతులకు పెట్టుబడిలో కొంత భారం తగ్గిం చేందుకు ఒక ఎకరాకు నాలుగువేల రూపాయల విలువైన ఎరువ్ఞల ను ఉచితంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకురావ డం ఆహ్వానించదగ్గ పరిణామం. కరెంటు కష్టాలుకూడా చాలా వరకు తొలిగాయని చెప్పొచ్చు.మిషన్‌ కాకతీయతోపాటు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయి తేనీటి సమస్యలు తీరే అవకాశాలు కన్పిస్తు న్నాయి. ఇవన్నీ రైతులకు ఎంతోకొంత ఊరట కలిగిస్తాయి. వ్యవ సాయాన్ని ముందుకు నడిపిస్తాయి. అయితే వీటితోటే సమస్యలన్నీ తొలగిపోతాయని భావించడం పొరపాటే అవ్ఞతుంది. ప్రకృతి చేస్తు న్న బీభత్సంతోపాటు తోటి మానవ్ఞడు చేస్తున్న దగాతో రైతులు కుదేలవ్ఞతున్నారు.కళ్లముందు నాసిరకం విత్తనాలు,పురుగు మందు లతో రైతులను దోపిడీ చేస్తున్నా పట్టించు కోవడం లేదు. అందిన చోటల్లా అప్పులు చేసి తీరా పంట వచ్చే సమయంలో విత్తనాలు నాసిరకమనో,నకిలీవనో తేలడంతో తెలియక వచ్చిన రోగానికి కొట్టిన పురుగుమందు బోగస్‌ కావడంతో రైతు కుప్పకూలిపోతు న్నాడు.ఈ ఏడాదికూడా నకిలీరకం విత్తనాలు రైతులను నిలువ్ఞనా ముంచాయి.

ఎప్పటికప్పుడు ఈ నకిలీ, నాసిరకం వ్యాపారులపై ఉక్కుపాదం మోపుతామని చట్టాలను మరింత కఠినతరం చేస్తామని చెపుతున్నారేతప్ప అవి ఆచరణకు వచ్చేసరికి కాగితాలకే పరిమిత మవ్ఞతున్నాయి. ఏటా రెండు తెలుగు రాష్ట్రాల్లో నకిలీ నాసిరకం క్రిమిసంహారక మందులు, ఎరువ్ఞల వ్యాపారం మూడువందల కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంచనా. ఇక అనుమతి లేని విత్తనాల కంపెనీ లు తెలుగు రాష్ట్రాల్లో ఇష్టానుసారంగా అమ్మకాలు సాగిస్తున్నారు. విత్తన చట్టం రైతులకంటే వ్యాపారస్తులకే ఉపయోగపడేలా ఉంది. దీనిని మార్చాలని రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మోసపో కుండా పటిష్టమైన చట్టం చేయాలనే ప్రతిపాదనలు దశాబ్దాల తర బడి కేంద్రప్రభుత్వం వద్ద పెండింగ్‌లోఉన్నాయి.మొత్తం వ్యవసాయ రంగం అస్తవ్యస్థంగా ఉంది. నకిలీ వ్యాపారులు దళారులదే పైచేయి గా ఉంది. వీటిని అరికట్టేందుకు గతంలో ఏమీచేయలేదని చెప్ప డం లేదు.కోట్లాది రూపాయలు సబ్సిడీరూపంలో విడుదల చేశారు. వరదలు, కరవ్ఞలు వచ్చినప్పుడు రైతులను ఆదుకునేందుకు నష్టపరి హారాల రూపంలో నిధులు విడుదల చేశారు. కానీ అందులో పదో వంతు కూడా రైతులకు అంది ఉండకపోవచ్చు. కరవ్ఞలు వచ్చినా, వరదలు వచ్చినా, ఎలాంటి విపత్తులు వచ్చినా దళారులకు కొందరి అవినీతి అధికారులకు కల్పతరువ్ఞలుగా మారుతున్నాయి. రైతుల ను ఆదుకునేందుకు తాము ఉన్నామని పాలకులు ఎంతగా చెపుతు న్నా వారిలో విశ్వాసంకలగడంలేదు. పాలకులపై రానురానూ నమ్మ కం సన్నగిల్లుతుండడంవల్లనే ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. పాలకులు వాస్తవాలను గ్రహించాలి. అన్నిటికంటే ముఖ్యంగా రైతు ల్లో విశ్వాసం,నమ్మకం పెంచాలి.

అందుకు రైతులకు కావాల్సింది మాటలు కాదు, చేతలు. అప్పుడే చెప్పేవారిపట్ల నమ్మకం కుదురు తుంది. అంతేకాని ఉపన్యాసాలవల్ల ఆశించిన ఫలితాలుండవ్ఞ. చేతల్లో ఫలితాలు అందించడంతోపాటు సలహాలుకూడా ఇస్తుంటే.. ఈ నమ్మకం, విశ్వాసం పెరుగుతుంది. భారత ఇతిహాసంలో కురు క్షేత్రయుద్ధం అనంతరం ధర్మరాజుకు పరిపాలనలో కిటుకులు, మెళ కువలు, రాజధర్మాలు బోధించమని శ్రీకృష్ణుడు అంపశయ్యపై చివరి అంకంలో ఉన్న భీష్మాచార్యున్ని కోరుతాడు.’సర్వం తెలిసిన నీవ్ఞ ఉండగా నేనేమి చెప్పగలను. అయినా నేను అవసాన దశలో ఉన్నా ను, జ్ఞాపకశక్తిపోయింది. మాట్లాడే ఓపికలేదు అని భీష్మపితామహుడు నిస్సహాయత వ్యక్తం చేస్తాడు. జ్ఞాపక శక్తితోపాటు అన్ని శక్తులను ప్రసాది స్తున్నాను చెప్పండి అని శ్రీకృష్ణుడు బదులిస్తాడు.’అన్ని శక్తులు నాకు ఇచ్చి నాతోచెప్పించేకంటే మీరే చెప్పొచ్చు కదా అనే సందేహం భీష్ముడు వ్యక్తం చేస్తాడు. దానికి కృష్ణుడు ‘కురు క్షేత్రయుద్ధ సమయంలో యుద్ధాన్ని ఆపి అర్జునుడికి గీతోపదేశం చేశాను. ఒక్కముక్క అర్థమైనట్లు లేదు. నాలో నే లోపం ఉండవచ్చు.అంతేకాదు అపార అనుభవంతోపాటు ఆ ధర్మ సూత్రాలను ఆచరణలో నిరూపించి నీపట్ల నమ్మకం పెంచు కున్న మీరు చెబితేనే సార్థకత ఉంటుంది.వారికి ఉపయోగపడు తుందని స్పష్టంచేస్తాడు. ఇదెందుకు చెపుతున్నామంటే ముఖ్యమం త్రి చంద్రశేఖరరావ్ఞపై రైతులకు ఇప్పుడిప్పుడే విశ్వాసం ఏర్పడు తున్నది.ఆధునిక జీవన స్రవంతిలో విద్యుత్‌చ్ఛక్తి ప్రాణవాయువ్ఞ వంటిది. కరెంటు దీపం వెలగని నాగరికత మోటారు తిరగని వ్యవ సాయ,పరిశ్రమ రంగాలను ఊహించలేం. అలాంటి కరెంటు కష్టాలు చాలావరకు తొలగిపోయాయి.రుణమాఫీ,ఎరువ్ఞలు,ఇతర సబ్సిడీలు కూడా రైతులకు నూతన ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఇలాంటి తరుణంలోనే రైతులను ఆత్మహత్యల బాటల నుండి మళ్లించేందుకు త్రికరణశుద్ధిగా ప్రయత్నం జరగాలి.

వారు నమ్ముకున్న భూమి వెను క నేటి సమాజం,ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానం అండదండలతో విత్తనం నాటినప్పటి నుండి శ్రమ ఫలాలను విక్రయించుకునే దాకా తమ వెంట ఉన్నారనే విశ్వాసాన్ని వారిలో కలిగించాలి. రైతుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోడం దేశానికి,రాష్ట్రానికి క్షేమం కాదు. రాబోయే ఖరీఫ్‌కు ఇప్పటి నుంచే పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి. నకిలీ, నాసి రకం విత్తనాలు, క్రిమిసంహారక మందులు సరఫరా కాకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకోవాలి. పోలీసు యంత్రాంగాన్ని రంగంలోకి దించాలి. వీటిపై ఉక్కుపాదంమోపి నివారించకుండా ఎన్ని పథ కాలు చేపట్టినా మరెన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో రైతులకు అందించినా ప్రయోజనం ఉండదు. ముఖ్యమంత్రిగా కేసి ఆర్‌కు ఇది మంచి అవకాశం. అసమాన ధైర్యం అపారమైన ఆత్మ విశ్వాసం, వాక్చాత్యురం ఆయనకు ఉన్నాయి. దీనికితోడు రైతులకు ఏదో చేయాలనే తపన, ఆరాటపడుతున్నారు. స్వయంగా ఆయన కూడా రైతే. రైతుల కష్టాలు ఆయనకు తెలియందికాదు. అంతేకాదు ముఖ్యమంత్రి పదవి అనేది ఆయన స్వయంకృషితో, స్వయంశక్తి తో, స్వయం ప్రతిభతో సాధించుకున్న పదవేకానీ ఎవరో తెచ్చి ఇచ్చిందికాదు. రాజకీయాలకు అతీతంగా, రైతు సంక్షేమాన్ని దృష్టి లో ఉంచుకుని రాష్ట్రం నుంచి నకిలీలను పారద్రోలాలి. చేపట్టే కార్య క్రమాల్లో అవినీతికి ఆస్కారం లేకుండా అమలుచేయాలి. ప్రకృతి సహాయ నిరాకరణతోపాటు మానవ వంచనకుగురై కృంగికృశించిపో తున్న రైతన్నలకు అభయహస్తం అందించాలి.

– దామెర్ల సాయిబాబ