తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు

మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,151..మొత్తం మృతుల సంఖ్య 1,489

1,967 new corona cases in Telangana
1,967 new corona cases in Telangana

హైదరాబాద్‌: తెలంగాణలో కొత్తగా 635 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో నలుగురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 565 మంది కోలుకున్నారు.

ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,77,151కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,67,992 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 1,489కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 7,670 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 5,557 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 141 , రంగారెడ్డి జిల్లాలో 76 కరోనా కేసులు నమోదయ్యాయి.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/