విశాఖ ఏజెన్సీలో కోటి రూపాయిల విలువైన గంజాయి పట్టివేత

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్రగ్స్ , మాదకద్రవ్యాలు , గంజాయి ఇవి పెద్ద ఎత్తున రవాణా అవుతున్నాయని విపక్షాలు ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో క్రైం పెరిగిపడానికి ఇవే కారణమని..వీటిని అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతుందని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుండడం తో ప్రభుత్వం చెక్ పోస్టులను మరింత కఠినం చేసింది. ఈ తరుణంలో చాల చోట్ల గంజాయి ను పోలీసులు పట్టుకుంటున్నారు. తాజాగా విశాఖపట్నం ఏజెన్సీలో కోటి రూపాయిల విలువైన గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

అనంతగిరిలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులకు అటుగా వెళ్తున్న ఓ వ్యాన్‌ను చూడగా, అనుమానం వచ్చింది. వెంటనే ఆ వ్యాన్‌ను అడ్డుకుని, తనిఖీలు చేపట్టగా..అందులో పెద్ద ఎత్తున గంజాయి ని తరలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన ఇద్దరు స్మగ్లర్లులను అరెస్ట్ చేసి.. వ్యాన్‌తో సహా 620 కేజీల గంజాయి సీజ్ చేశారు. ఒడిశా రాష్ట్రంలోని పాడువా నుంచి గంజాయిని హర్యానాకు తరలిస్తున్నట్టు విచారణలో తేల్చారు. ఈ గంజాయి విలువ కోటి రూపాయిలకు పైగా విలువ ఉంటుందని అంటున్నారు.