60సంవత్సరాల్లో ఎప్పుడు జరగని అభివృద్ధి

Dr.Kodela

సత్తెనపల్లి నియోజకవర్గం, పట్టణం అభివృద్ధికి ప్రభుత్వం అన్నివిధాల సహకరిస్తుందని ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు అన్నారు.

సత్తెనపల్లి పట్టణంలో 8వ వార్డులో నిర్మించిన మోడ్రన్ అంగన్వాడీ కేంద్రం, అచ్చెంపేట రోడ్డులోని రైల్వే గేట్ వద్ద నిర్మించిన కమ్యూనిటి టాయిలెట్స్ ను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు సంవత్సరాల్లో సత్తెనపల్లి పట్టణంలో గత 60సంవత్సరాల్లో ఎప్పుడు జరగని అభివృద్ధి చేసుకున్నామన్నారు.

అంగన్వాడీ పాఠశాల ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ మూడు సంవత్సరాల్లో ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలు, అందులో పనిచేసే సిబ్బంది అభివృద్ధికి పలు సంక్షేమ పధకాలు ప్రవేశపెడుతుందన్నారు.

అంగన్వాడీలు అక్కడకు వచ్చే పిల్లలు, గర్భిణీ స్త్రీలను తమ పిల్లు, అక్కచెల్లెల్లుగా చూసుకోవాలని పిలుపునిచ్చారు.

అంగన్వాడీ పాఠశాలల్లో ప్రజలను భాగస్వామ్యం చేసి వారి ఇళ్లలో ప్రత్యేక రోజు సందర్భంగా అంగన్వాడీ పాఠశాలకు చేయుతనిచ్చే విధంగా కార్యక్రమాలు రూపోందించాలన్నారు.

అధికారులు, నాయకులు ఎప్పటికప్పుడు అంగన్వాడీ పాఠశాలల విజిట్ చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం మరుగుదొడ్లు ప్రారంభించారు.

మరుగుదొడ్లు నిర్మాణం లో ప్రపంచం మొత్తం సత్తెనపల్లి వైపు చూస్తుందన్నారు.

ప్రజలు నూటికి నూరు శాతం మరుగుదొడ్లు ఉపయోగించి ఆరోగ్యం కాపాడుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో స్పీకర్ తో పాటు సత్తెనపల్లి మున్సిపల్ చైర్మన్, కమిషన్, నాయకులు, అధికారులు పాల్గోన్నారు.