60శాతం పూర్తిచేసుకున్న ‘లవర్‌

raj tarun
raj tarun

దిల్‌రాజు నిర్మాణంలో రాజ్‌తరుణ్‌ హీరోగా రూపొందుతున్నసినిమా లవర్‌. అలా ఎలా సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన అనీష్‌కృష్ణ ఈసినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈచిత్రం షూటింగ్‌ అనంతపురం పరిసర ప్రాంతాల్లో జరిగింది.. తాజాగా హైదరాబాద్‌ మెట్రోలో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈసినిమా షూటింగ్‌ 60శాతం పూర్తయింది..
యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈసినిమాలో రిద్ది కుమార్‌ ఈసినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.. ముందుగా ఈసినిమాలో మలయాళం నటి గాయత్రి సురేష్‌నటించాల్సి ఉంది.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమె ఈసినిమా నుంచి తప్పుకున్నట్టు తెలిసింది.. రంగులరాట్నం సినిమా తర్వాత రాజ్‌తరుణ్‌ నటించిన రాజుగాడు మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈసినిమా తర్వాత లవర్‌ రానుంది.. డైరెక్టర్‌ బి.జయ దర్శకత్వంలో రాజ్‌తరుణ్‌ ఒక సినిమా చేసే అవకాశాలున్నాయని తెలిసింది.