సముచితస్థానం ఇస్తే మగవాళ్ల గౌరవమేపెరుగుతుంది

Women'sDay
Women’sDay in Hyderabad

సముచితస్థానం ఇస్తే మగవాళ్ల గౌరవమేపెరుగుతుంది

హైదరాబాద్‌: ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఇక్కడి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. నిజామాబాద్‌ ఎంపి కవిత ముఖ్యఅతిథిగా ప్రసంగించారు.. జాగృతి స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేంద్రాల్లో 3వేల మందికి మహిళలకు శిక్షణ ఇస్త్తున్నట్టు తెలిపారు.. ఉద్యోగం, వ్యాపారం తదితర వ్యాపకాల్లోమహిళలు మంచి స్థానం సంపాదించాలన్నారు. మహిళలకు సముచితస్థానం కల్పిస్తే మగవాళ్ల గౌరవమే పెరుగుతుందన్నారు.. మహిళలు ఇపుడిపుడే అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని అన్నారు.. మహిళల కోసం తెలంగాణ జాగృతి నిరంతనం పనిచేస్తుందన్నారు.. మహబూబాబాద్‌లోసారా నిర్మూలనలో జాగృతి కార్యకర్తల కృషి ఉందన్నారు.